వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడం.. మాలలకు జరిగిన అన్యాయం : ఆవుల బాలనాథం

హైదరాబాద్ : వివేక్ కు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం మాలలకు జరిగిన అన్యాయం అన్నారు మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు  ఆవుల బాలనాథం. వివేకానందకు పెద్దపల్లి ఎంపీ టికెట్ పై ఆయన శనివారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. “వివేక్ కు మేము అండగా ఉంటాము.  కేసీఆర్ మాలల వ్యతిరేకి. మేము మొన్న జరిగిన ఎన్నికల్లో మద్దతు ఇచ్చాము.  ఈశ్వర్ కు టికెట్ ఇచ్చి మాకు న్యాయం చేశారు అనుకున్నాము కానీ..  మళ్ళీ మాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. పెద్దపల్లిని కాకా చాలా అభివృద్ధి చేశారు. బెల్లం పల్లి, చెన్నూర్ లో వినోద్ కు టికెట్ ఇవ్వలేదు.  కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఆహ్వానం మేరకు TRSలోకి వెళ్లారు. అప్పుడు కేసీఆర్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చలేదు. టికెట్ ఇవ్వకపోవడం అవమాన పరచడమే. వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వం నుంచి 15,300 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు. ఎంపీ నిధులలో  16 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రస్ట్ ద్వారా పెద్దపల్లిని అభివృద్ధి చేశారు. తాగు నీరుకు ఇబ్బంది పడుతుంటే 1000కి పైగా బోర్లు వేయించారు. సాగు నీరు కోసం చెరువులు తవ్వించారు.

దళిత నాయకుడు ఎదుగుతుంటే ఓర్వలేకనే కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. మాలలను అణచివేయడానికి వివేక్ కు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. TRSలో మాల, మాదిగలను అణచి వేస్తున్నారు. కేసీఆర్, KTR మంచిగా ఉండి గొంతు కోశారు.  అభివృద్ధి పనులు చేసినందుకే వివేక్ కు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. పెద్దపల్లికి కాకా పేరు పెట్టలేదు. ట్రేడ్ యూనియన్ లను స్థాపించింది కాకా.  కార్మికులకు పెన్షన్ స్కీమ్ ను తీసుకు వచ్చింది కాకానే.  1969 ఉద్యమంలో కాకా కాలుకు బుల్లెట్ తగిలింది. సామాజిక సేవ కోసమే అంబెడ్కర్ కళాశాల లను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు డోనేషన్ లేకుండా చదువు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో TRSకు బుద్ధి చెప్పాలి.  ఉద్యమ ద్రోహులకు టికెట్ ఇచ్చారు.  కొత్తగా కాంగ్రెస్ నుండి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి వివేక్ ను అవమానించారు. KTR , వివేక్ ఒక్కటే అనుకున్నాం కాని.. వివేక్ కే టికెట్ ఇవ్వలేదు.  వివేక్ టికెట్ ఇవ్వకపోవడం మొత్తం దళిత వర్గాన్ని కించపరచడమే. నువ్వు పోటీ చెయ్ నీకు మేము నీకు అండగా ఉంటాము.

కేసీఆర్ వల్ల దళితులకు ఒరిగింది ఏమి లేదు. ఇప్పటికి పోయింది ఏమి లేదు. వివేక్ కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలి.  కొంత మంది తప్పుడు సమాచారం ఇచ్చి వివేక్ కు ఎంపీ టికెట్ రాకుండా చేశారు. వారికి కూడా భవిష్యత్ ఉండదు. సంఘాలు అన్ని ఏకం కావాలి. ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి. పిలిచి టికెట్ ఇస్తాను అని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన హామీని మరిచారు.  బెల్లంపల్లి మినహా అన్ని నియోజక వర్గాల్లో వివేక్  ప్రచారం చేశారు.  కొంత మంది దళిత నాయకులు కావాలని వివేక్ పై  దుష్ప్రచారం చేస్తున్నారు. దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు ఆవుల బాలనాథం.

Latest Updates