హైదరాబాద్ లో కరోనాకు తోడు మలేరియా, డెంగీ

 ట్రీట్ మెంట్ కోసం జనం నానా యాతన

పేషెంట్లను చూడాలంటేనే జంకుతున్న హాస్పిటళ్లు

కరోనా టెస్టు చేయించుకోండని తిప్పి పంపేస్తున్న ఆస్పత్రులు

నెగెటివ్ వచ్చినోళ్లలో కొందరికి డెంగీ, మలేరియా పాజిటివ్

ఇప్పటికే 100 డెంగీ, 50 మలేరియా కేసులు నమోదు

సిబ్బంది లేకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త

హైదరాబాద్ , వెలుగు: హైదరాబాద్ లో జ్వరాలు పెరిగి పోతున్నాయి. మలేరియా, డెంగీ కేసులు ఎక్కువ అవుతున్నాయి. వర్షాకాలం రావడం.. చెత్తా చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోతుండడంతో దోమలు బాగా పెరిగాయి. దీనిపై జీహెచ్ ఎంసీ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో సీజనల్ జబ్బు లు ఎక్కువవుతున్నాయి. ఫాగింగ్ చేయక, చెత్తను తీసుకెళ్లక పోవడం వల్ల జనాలు జబ్బు పడుతున్నారు.

కరోనా టెస్ట్​ చేయించుకున్నాకే

జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి .. మామూలుగా అయితే ఇవి సీజనల్ గా వచ్చేవే. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. దీంతో చిన్న జలుబు చేసినా కరోనానేమోనన్న గుబులు పట్టుకుంది జనాలకు. ఇటు ఆస్పత్రులకు వెళ్లినా డాక్టర్లు వాళ్లను ముట్టట్లేదు. అసలు వాళ్లను దగ్గరకు రానివ్వడమే లేదు. కరోనా టెస్ట్​ మస్ట్​ అంటున్ నారు. దీంతో ముందు కరోనాటెస్టింగ్ సెంటర్​కే పరుగులు పెడుతున్నారు. అక్కడ టెస్ట్​ చేయించుకున్న తర్వాతే వేరే ఆస్పత్రికి వెళుతున్నారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్ వస్తే.. మలేరియా, డెంగీ టెస్టుల్లో చాలా మందికి పాజిటివ్ వస్తున్నది. ఇటీవల దాదాపు 100 డెంగీ, 50 దాకా మలేరియా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇవి కేవలం గవర్నమెంట్​ ఆస్పత్రుల్లో చేసిన టెస్టుల తాలూకు రిజల్ట్స్ . ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంలలో మరిన్ని ఎక్కువ కేసులు ఉండొచ్చని అంటున్నారు. పోయినేడాది హైదరాబాద్ జిల్లాలో 2,709 డెంగీ, 305 మలేరియా కేసులు నమోదయ్యాయి.

ఫాగింగ్ సక్కగ చేస్తలె

సీజన ల్ జబ్బు లకు సంబంధించి ఈ ఏడాది బల్దియా ముం దస్తు ప్రణాళికను సిద్ధం చేయలేదు. కాలనీలు, బస్తీలపై ఎలాం టి దృష్టి పెట్టడంలేదు. వర్షాలు కురుస్తుం డటంతో ఇటీవల దోమలు విజృంభిస్తున్నాయి. సాయంత్రమైతే చాలు ఇంటి తలుపులు తెరవలేని పరిస్ థితి ఉంది. వర్షాకాలం మొదలై రెండు నెలలవుతున్నా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పట్టించుకోవట్లేదు . దోమల నివారణకు చేయాల్సిన ఫాగిం గ్ నూ సక్కగా చేస్తలేరు. దోమల నివారణకు బల్దియా ఆధ్వర్యంలో 125 టీం లు పని చేస్తున్నాయి. ఒక్కో టీం లో ఓ సూపర్​ వైజర్​ తో పాటు 18 మంది కార్మికులు ఉంటారు. గతంలో ముగ్గురు కార్మికులు ఒక జట్టుగా ఇంటింటికి తిరిగి యాం టీ లార్వా ఆపరేషన్లను (ఏఎల్ వో) నిర్వహించేవారు. సిబ్బంది తక్కువ ఉన్నారంటూ గత రెండేళ్ల నుం చి ఇద్దరిద్దరినే ఏఎల్ వో కార్యక్రమాలకు పంపిస్తున్నారు. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి పరిసరాల్లో శానిటైజేషన్ చేయడానికే ఎంటమాలజీ విభాగానికి సరిపోతోంది . దీంతో దోమల నివారణను పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో మలేరియా, డెంగీ కేసులు పెరుగుతున్నాయి.

ఎక్కడి చెత్త అక్కడే

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పారిశుధ్యం ఎంతో అవసరమని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే  చెబుతున్నారు. కానీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీల్లో చెత్త పేరుకుపోయి కంపు కొడుతున్నా ఎవరూ పట్టిం చుకోవడంలేదు. ఇంటింటికెళ్లి  చెత్త తీసుకెళ్లే సిబ్బందిలో కొందరు సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు కరోనా బారినపడ్డా రు. దీంతో చాలా మంది భయానికి చెత్తను తీసుకెళ్లట్లేదు. గ్రేటర్ పరిధిలో దాదాపు 3 వేల చెత్త తీసుకెళ్లే ఆటోలు ఉండగా, ఇందులో వెయ్యి ఆటోల వరకు ప్రస్తుతం తిరగడంలేదని తెలుస్తోంది. చెత్త కోసం ఇంటికి వాహనం రాకపోతుం డటంతో సిటీజనం చెత్తను దగ్గర్లోని చెత్త బిన్లలో వేస్తున్నారు. మరికొం దరు రోడ్ల పక్కనే పడేస్తున్నారు. రోడ్లు ఊడ్చే స్వీపర్లు కూడా కరోనా భయంతో సరిగ్గా డ్యూటీలు చేయట్లేదు. దీంతో చెత్త పేరుకుంటోంది. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా పెద్దగా ఫలితాలివ్వలేదు.

అనుమానం ఉంటే చెక్ చేస్తున్నం

నిరుడు ఎక్కువ సంఖ్యలో డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలపై దృష్టి పెట్టాం . ఇప్పుడైతే కరోనాపైనే ఎక్కువ ఫోకస్ . కరోనా టెస్టుల్ లో భాగంగా డెంగీ, మలేరియా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం . లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి డెంగీ పరీక్షలు నిర్వహించుకోవాలి. డెంగీ ప్రభావం ఎక్కువగా ఆగస్టు, సెప్టెం బర్ , అక్టోబర్ నెలల్లో నే ఉంటుంది. – డాక్టర్ నిరంజన్ , హైదరాబాద్ జిల్లా మలేరియా ఆఫీసర్.

ఫాగింగ్ చేస్తున్నం

కరోనా సోకిన పేషెంట్ ఇంటి దగ్గర శానిటైజేషన్ చేయడంతో పాటు సాయంత్రం ఫాగింగ్ కూడా చేస్తున్నం. మిగతా ప్రాంతాల్లో కూడా దోమలు పెరగకుం డా చర్యలు తీసుకుంటున్నాం. దోమల నివారణకు ఇప్పటికే నగరంలోని చెరువులపై మూడు డ్రోన్లతో ఫాగింగ్ చేస్తున్నాం . మరో 11 డ్రోన్ల కోసం టెండర్లు వేస్తున్నాం . దోమలు వ్యాప్తి చెందకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రాంబాబు, చీఫ్ ఎంటమాలజిస్ట్.

 

 

Latest Updates