పుట్టిన ప్రతి మనిషి అందంగా ఉండాలా? అందంగా ఉంటే అన్నీ జయించినట్లేనా? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలరో చెప్పండి? కానీ, ఒకడు అందంగా లేడు, నల్లగా ఉండు, ముఖంపై మచ్చలున్నాయి, పెదవులు వంకర ఉన్నాయి.. ఇలా పేర్లు పెట్టే హక్కు కూడా ఎవరికుందో చెప్పండి? ఒక మనిషి అంటే.. ఏదైనా కొలమానం ఉందా? రంగు, ఎత్తు, బరువు, ఆకృతి, కులం.. ఇలా చర్చించుకుని.. అవమాన పరిచే వ్యక్తులు సమాజంలో ఎందుకుంటారు?
ఇలా ఏ విధంగా మాట్లాడుకున్న.. " ఒక వ్యక్తి యొక్క తలరాతని, వ్యక్తిత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీలేదు. ఆత్మవిశ్వాసమే మనిషికి అసలైన అందం. అదే జీవిత అర్ధం. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నరోజు అన్నీ జయిస్తావు.. " ఇపుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. " సరిగ్గా ఇలాంటి అవమానాలతోనే.. సమాజంలో బ్రతికే కుర్రాడి కథ ఆధారంగా ఓ మూవీ తెరకెక్కింది. అదే మలయాళ మూవీ "తలవర" (Thalavara).
ఇపుడు ఈ తలవర మూవీ ఓటీటీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చుతుంది. అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో అర్జున్ అశోకన్, రేవతి శర్మ జంటగా నటించారు. దేవదర్శిని చేతన్, శరత్ సభ, అతిరా మరియం కీలక పాత్రలు పోషించారు.
Hearing excellent reviews about #Thalavara, now running in theatres… Congrats and Best wishes to @Arjun__Ashokan, @iAkhilAnilkumar and team! 💐💐👍👍👍sjs pic.twitter.com/BLaXXoiyEE
— S J Suryah (@iam_SJSuryah) September 7, 2025
హీరో జ్యోతిష్ (అర్జున్ అశోకన్) బొల్లి వ్యాధితో బాధపడుతుంటాడు. అది చూసి స్నేహితులు సహా అందరూ తనను వెక్కిరిస్తుంటారు. అతడు కూడా కెమెరా ముందుకు రావాలంటే జంకుతాడు. ఇలాంటి కుర్రాడు తన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కున్నాడు? చివరకి తనకు తాను ఎలా మలుచుకున్నారు అనేది సినిమా కథ. ఈ క్రమంలో మూవీ చూసిన సగటు ఆడియన్స్ నుంచి సినీ ప్రముఖుల వరకు ఎమోషనల్ ట్వీట్స్ పెడుతున్నారు. హీరో ఆత్మ స్పైర్ధ్యానికి కుదాస్ అనాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు.
#Thalavara : Beautiful, Completely Satisfied 🤍
— 𝚂𝙷𝙰𝙷𝙸𝙽 𝚂𝙷𝙰𝙽 𝚅𝙿 (@therealshahin_) October 29, 2025
Emotionally hooking Screenplay and so relatable 🥺 #ArjunAshokan delivers his career best perfo, #RevathySarma & #Ashokan also superb. The entire cast was nice ✨#ElectronicKili music is purely uplifting 💗🫶🏼
5/5 ⭐ pic.twitter.com/PW5pBa8qo8
కథేంటంటే:
జ్యోతిష్ (అర్జున్ అశోకన్) అనే పిరికి యువకుడి కథ ఇది. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అతను బొల్లి (విటిలిగో) వ్యాధితో బాధపడుతుంటాడు. ఒక సూపర్ మార్కెట్లో సేల్స్ మ్యాన్‌గా పనిచేస్తుంటాడు. అయితే.. సమాజం, స్నేహితులు, కుటుంబం చూపించే జాలి, కొంతమంది నుంచి ఎదుర్కొనే అవమానాలు అతని ఆత్మ -విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
కానీ.. సినిమా రంగంలో యాక్టర్‌గా ఎదగాలి అనే కల, అతని జీవితంలోకి వచ్చిన సంధ్య (రేవతి శర్మ)తో ఏర్పడే ప్రేమ.. జ్యోతిష్ ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
