ఆస్కార్ బరిలో జల్లికట్టు.. దున్నపోతు రంకెలేసేనా?

న్యూఢిల్లీ: మలయాళంలో ఘన విజయం సాధించిన జల్లికట్టు చిత్రం ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఇండియా నుంచి రేసులో నిలవనుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా నుంచి జల్లికట్టును పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ తెలిపింది. లిజో జోస్ పెల్లిసెరీ డైరెక్షన్ వహించిన జల్లికట్టులో అంగమలై డైరీస్ ఫేమ్ ఏమా యావ్ నటించారు. ఒక ఊరిలో ఓ ఉన్మాద దున్నపోతు పారిపోవడం, దాన్ని గ్రామస్థులు పట్టుకోవడం నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది. ఈ సినిమాను రీసెంట్‌‌గా తెలుగులో విడుదల చేశారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌‌ఫామ్ ఆహాలో జల్లికట్టు తెలుగులో అందుబాటులో ఉంది. జంతువుల ప్రవృత్తితో పోల్చితే మానవుల ప్రవర్తన ఎంత అధ్వాన్నంగా ఉంటుందనే విషయాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రంలోని లొకేషన్లు, పాత్రలు, వాటి మధ్య సంఘర్షణను చాలా బాగా చూపించారు. అందుకే విధు వినోద్ చోప్రా తీసిన షికారా, దీపికా నటించిన ఛప్పాక్‌‌తోపాటు నెట్‌‌ఫ్లిక్స్‌‌లో వచ్చిన ది కార్గిల్ గర్ల్, బుల్‌‌బుల్, సీరియస్ మెన్ లాంటి సినిమాలను తోసిరాజని జల్లికట్టు ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచేందుకు అర్హత సాధించింది.

Latest Updates