చావమంటే చనిపోయిన అమ్మాయి.

మలేషియాలో ఓ 16ఏళ్ల అమ్మాయి తనకు చావాలని ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోల్ నిర్వహించింది. ఇందుకు తమ నిర్ణయం తెలపాలంటూ తనను ఫాలో అవుతున్న వారిని కోరింది. దీంతో  60 శాతం మంది ఆమెను చనిపోమని చెప్పారు. కొద్ది సేపటికే ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయింది. ఈ ఘటన మంగళ వారం జరిగింది. అయితే సూసైడ్ చేసుకునేందుకు కారణం మాత్రం తెలుపలేదు.

మలేషియా చట్టాల ప్రకారం.. ఎవరినైనా ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి మరణశిక్ష లేదా.. 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అయితే ఈ అమ్మాయి మరణానికి కారణమైన  వారిపై శిక్ష పడనుందని సమాచారం. ఈ ఘటన పై ఇన్ స్టా గ్రామ్ ను వివరణ కోరగా ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు మలేషియా పోలీసులు.

Latest Updates