మాల్దీవులలో కరోనా ఫస్టు డెత్

మాలె: ప్రపంచ దేశాలు వణికిస్తున్న కరోనా మాల్దీవులలోనూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 280 మందికి వైరస్ సోకింది. మాల్దీవుల కేపిటల్ సిటీ మాలెలో 83 ఏళ్ల మహిళ వైరస్ బారిన పడి చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రి అబ్దుల్లా అమీన్ గురువారం మీడియాకు చెప్పారు. మాల్దీవుల్లో ఇదే మొదటి మరణం అని ప్రకటించారు. పర్యాటక రంగం పై ఆధారపడిన మాల్దీవులలో కరోనాపై ఫైట్ కు ఇండియా సహకారం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఆపరేషన్ సంజీవని పేరిట వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థల సహకారంతో ఐఏఎఫ్ విమానంలో అత్యవసర మెడిసిన్ ను మాల్దీవులకు భారత్ అందించింది.

 

Latest Updates