ఏ కష్టమొచ్చిందో..! చెట్టుకు ఉరేసుకున్న యువతీ, యువకుడు

ఎవరేమన్నారో.. ఏ కష్టమొచ్చిందో గానీ.. ఓ యువతి.. ఓ యువకుడు.. ఒకే చెట్టుకు ఉరేసుకుని ఉసురు తీసుకున్నారు. ఈ దారుణం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.

యూపీలోని ఈతాజిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. చెట్టుకు వేలాడుతున్న రెండు డెడ్ బాడీలను చూసి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారి జేబులో ఉన్న ఆధారాలతో.. వారిని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. యువకుడి వయసు 23 ఏళ్లు.. యువతి వయసు 20 ఏళ్లు ఉంటుందని ఈతా జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ చెప్పారు. అమ్మాయిది పొరుగునే ఉన్న ఓ గ్రామం అని… అబ్బాయిది షాకీర్ గ్రామం అని చెప్పారు.

ప్రేమికుల బలవన్మరణం అని కొందరు అంటుంటే.. ఉరి వేసిన తీరు అనుమానాస్పదంగా ఉందని కొందరంటున్నారు. ఇది పరువు హత్య అనే అనుమానాలు వస్తున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Latest Updates