రిటైర్మెంట్‌‌పై మలింగ యూ టర్న్‌‌

కొలంబో: శ్రీలంక పేస్‌‌ స్టార్‌‌ లసిత్‌‌ మలింగ.. రిటైర్మెంట్‌‌పై యూ టర్న్‌‌ తీసుకున్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత ఆటకు గుడ్‌‌బై చెబుతానన్న మలింగ..  మరో రెండేళ్లు క్రికెట్‌‌ ఆడే సత్తా తనలో ఉందని స్పష్టం చేశాడు. ‘టీ20లో 4  ఓవర్లు మాత్రమే వేయాలి. నాకున్న స్కిల్స్‌‌తో ఓ బౌలర్‌‌గా దీనిని నేను మేనేజ్‌‌ చేయగలను. కెప్టెన్‌‌గా వరల్డ్‌‌ వైడ్‌‌ చాలా టీ20లు ఆడిన అనుభవంతో మరో రెండేళ్లు క్రికెట్‌‌లో కొనసాగుతా. టీ20 వరల్డ్‌‌కప్‌‌లో సారథిగా ఉంటానో లేదో తెలియదు.

దీనిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలి’ అని మలింగ వెల్లడించాడు. ప్రస్తుతం లంక టీమ్‌‌లో నైపుణ్యం ఉన్న బౌలర్ల కొరత ఉందన్నాడు. కండీషన్స్‌‌కు తగ్గట్లుగా నిలకడగా  ఆడే వారు లేరన్నాడు. ‘నైపుణ్యం ఉన్న బౌలర్లు ఏడాదిలో, ఏడాదిన్నరలో దొరకరు. వాళ్ల కోసం ఓపికగా రెండు, మూడేళ్లు వేచి చూడాలి. ఏ ఫార్మాట్‌‌లోనైనా నిలకడ ముఖ్యం. టీమ్‌‌లోకి వచ్చే కుర్రాళ్లకు కూడా ఎక్కువ చాన్స్​లు ఇస్తేనే  నైపుణ్యం ఉన్న బౌలర్లు అందుబాటులోకి వస్తారు’ అన్నాడు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates