సైనికుల తిరుగుబాటుతో దేశాధ్యక్షుడి రాజీనామా

తనను పదవి నుంచి దిగిపోవాలని కోరుతూ సైనికులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో మాలి దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. తన పదవి కోసం మాలిలో రక్తపాతం జరగవద్దని భావిస్తే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఒక పక్క సైనికులు నిరసనలు చేస్తుండగా.. మరోపక్క కరోనా తీవ్రత పెరుగుతోందని ఆయన అన్నారు. ఎనిమిదేళ్లుగా సైనిక తిరుగుబాటు జరుగుతుందని.. అందుకే తన ప్రభుత్వం మరియు జాతీయ అసెంబ్లీ కూడా రద్దు చేయబడుతుందని ఆయన ప్రకటించారు. 2013లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కీటా.. మళ్లీ 2018లో కూడా తిరిగి దేశాధ్యక్షడిగా ఎన్నికయ్యారు. తిరుగుబాలు సైనికులు అధ్యక్షుడితో పాటు ప్రధాన మంత్రి బౌబౌ సిస్సేను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా బమాకో పట్టణాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మాలి రాజకీయ సంక్షోభానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆఫ్రికన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత పరిణామాలను ఖండించాయి. మాలిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి యుఎన్ భద్రతా మండలి బుధవారం మధ్యాహ్నం ఒక సమావేశాన్ని షెడ్యూల్ చేసింది.

For More News..

సర్పంచ్ ద్వారా ఎమ్యెల్యేకు కరోనా

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

భర్త మరియు పిల్లలను చంపి సూసైడ్ చేసుకున్న లేడీ డాక్టర్

Latest Updates