ఏసీబీకి చిక్కిన జీహెచ్​ఎంసి టాక్స్ ఇన్స్పెక్టర్

అసిస్టెంట్ సాయంతో లంచాల డిమాండ్

ప్రైవేట్ వ్యక్తిని అసిస్టెంట్ గా నియమించుకొని అవినీతికి పాల్పడుతున్న మల్కాజగిరి జీహెచ్​ఎంసి టాక్స్ ఇన్స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. మల్కాజిగిరిలోని మీర్జాలగుడాలో ఒక అపార్ట్ మెంట్ యొక్క ప్లాట్స్ కు చెందిన అసెస్మెంట్ విషయంలో ఒక్కొక్క ఫ్లాట్ కు  రూ.2500 లంచం డిమాండ్ చేశాడు ట్యాక్స్  ఇన్స్పెక్టర్ దుర్గాదాస్. మల్కాజిగిరి మున్సిపాలిటీలో అసిస్టెంట్ టాక్స్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దుర్గాదాస్…  నాగరాజు అనే ప్రైవేట్ వ్యక్తిని అసిస్టెంట్ గా నియమించుకుని అతని ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు.

లంచం డిమాండ్ చేసినందుకు బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఈరోజు ఏకకాలంలో అతని ఇంటిపై, కార్యాలయంపై అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు. విచారణ జరిపి మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇందులో మరో టాక్స్ ఇన్స్పెక్టర్ బిక్షపతి పాత్రపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.

Latest Updates