ప్రేమించాలంటూ యువతికి వేధింపులు

  • యువకుడిని అరెస్ట్ చేసిన మల్కాజిగిరి పోలీసులు

మల్కాజిగిరి,వెలుగు:  ప్రేమించకపోతే చంపుతానంటూ యువతిని బెదిరిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ లింగస్వామి కథనం ప్రకారం..ఘట్ కేసర్ లోని ముత్వెల్లిగూడలో ఉండే దోమలపల్లె వినయ్ కుమార్(19) కార్ వాషింగ్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితం వినయ్ కి మల్కాజిగిరిలో ఉండే ఓ యువతితో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత తనని ప్రేమించాలంటూ యువతి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి వినయ్ తరచూ మెసేజ్ లు పెట్టడం ప్రారంభించాడు. ఆ యువతి నిరాకరించడంతో చంపుతానని వినయ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆందోళన చెందిన యువతి విషయాన్ని తండ్రికి చెప్పింది. యువతి తండ్రి శుక్రవారం మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  నిందితుడు వినయ్ ని ముత్వెల్లిగూడలో అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్ కి తరలించినట్టు ఎస్ఐ లింగస్వామి తెలిపారు.

Latest Updates