కరోనా భయం: లిఫ్ట్ లో బటన్స్ కు బదులు పెడల్స్ ఏర్పాటు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా దేన్ని ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే షాపింగ్‌ మాల్స్ తెరిచినా వెళ్లడానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. దీంతో థాయ్ లాండ్ లోని ఓ మాల్ లిఫ్ట్ బటన్స్ కు బదులుగా ఫుట్ పెడల్స్ ను అమర్చింది. కరోనాను నియంత్రించడంతో పాటు ప్రజలను మళ్లీ షాపింగ్ కు అలవాటు పడేలా చేయడానికి ఈ ప్రయత్నం చేసింది. బ్యాంకాక్ లోని సీకన్ స్క్వేర్ లో ఎలివేటర్స్ లోపల పెడట్స్ ను బిగించారు. ఏ ఫ్లోర్ కు వెళ్లాలో ఆ నంబర్ లేదా లెటర్స్, సింబల్స్ కు ఎదురుగా బిగించి ఉన్న పెడల్ ను నొక్కాలి. సాధారణంగా లిఫ్ట్స్ లో బటన్స్ వాడుతుంటారు. అయితే కరోనా కారణంగా కస్టమర్స్ హెల్త్ ను దృష్టిలో ఉంచుకొని సీకన్ స్క్వేర్ షాపింగ్ మాల్ యాజమాన్యం కొత్తగా థింక్ చేసి దీన్ని ఏర్పాటు చేసింది.

ఎలివేటర్ ను ప్రెస్ చేయడానికి మన కాళ్లను వాడొచ్చు, ఇది నిజంగ్రా గ్రేట్ అని ఓ కస్టమర్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఏదైనా ఓ వస్తువును టచ్ అయితే సులువుగా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ హ్యాండ్ ఫ్రీ, ఫుట్ ఆపరేటెడ్ ఎలివేటర్ ను ఏర్పాటు చేశాం’ అని సదరు మాల్ వైస్ ప్రెసిడెంట్ ప్రోట్ సోసోతికుల్ చెప్పారు. థాయ్ లాండ్ లో కరోనా కేసుల సంఖ్య 3,034గా ఉండగా.. 56 మరణాలు నమోదయ్యాయి.

Latest Updates