20 మంది స్టూడెంట్స్ పై మాల్​ప్రాక్టీస్ కేసులు

హైదరాబాద్​, వెలుగు: ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ గురువారం ప్రారంభమయ్యాయి. సెకండ్ లాంగ్వేజీ పరీక్షలో 22 మంది స్టూడెంట్స్​పై మాల్​ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్​ తెలిపారు. రంగారెడ్డిలో 12, యాద్రాదిలో ఐదు, నిజామాబాద్​లో రెండు, మహబూబ్​నగర్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. పరీక్షకు మొత్తం 4,18,944 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,03,459 మంది పరీక్ష రాశారు. 15,483 మంది ఆబ్సెంట్ అయ్యారు.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి

Latest Updates