ప్రగతి భవన్ లో స్వీట్లు పంచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

హైదరాబాద్ : రేపు రాష్ట్రమంత్రి వర్గ విస్తరణ ఉండటంతో ఎవరెవరికి బెర్తులు దక్కుతాయన్న ఆసక్తి రాజకీయ వర్గాలు , ప్రజల్లో కనిపిస్తోంది. మంగళవారం రాజ్ భవన్ రాష్ట్ర మంత్రులుగా నాయకులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో.. ప్రగతిభవన్, టీఆర్ఎస్ భవన్ లలో నాయకుల హడావుడి పెరిగింది. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రగతి భవన్ లో కేటీఆర్ తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత అందరికీ స్వీట్లు పంచారు. రంగారెడ్డి జిల్లా కోటాలో.. మల్లారెడ్డికి మంత్రిగా అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Latest Updates