ఆర్మీని అనుమానిస్తుంది మోడీనే: కాంగ్రెస్ నేత ఖర్గే

న్యూఢిల్లీ: మన సైన్యం సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయని ప్రధాని మోడీ చేస్తున్న వ్యాఖ్యల్ని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఢిల్లీలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆర్మీని ఎవరూ అనుమానించడం లేదా ప్రశ్నించడం చేయడం లేదని అన్నారు. ఆ పని చేస్తోంది ప్రధాని మోడీ మాత్రమేనని చెప్పారు. ఐఏఎఫ్ చేసిన ఎయిర్ స్ట్రైక్ క్రెడిట్ ను ఆయన తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఖర్గే అన్నారు. ప్రతిపక్ష నేతలంతా ఆర్మీని సపోర్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. మోడీ దగ్గర నుంచి తాము దేశ భక్తి పాఠాలు నేర్చుకోనవసరం లేదని అన్నారాయన.

ఇటీవల మోడీ బిహార్, తమిళనాడు, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సభల్లో ప్రసంగిస్తూ ప్రతిపక్షాలు ఆర్మీని అవమానిస్తున్నాయన్నారు. ఎయిర్ ఫోర్స్ దాడులకు ఆధారాలు కావాలని కొందరు నేతలు అంటున్నారని, ఎంత మంది ఉగ్రవాదులు మరణించారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారని మోడీ అన్నారు.

Latest Updates