నో కండీషన్స్ : ఇకపై 24 గంటలు పబ్బులు ఓపెన్

ముంబైని అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఇకపై 24గంటలూ పబ్బులు, షాపులు, రెస్టారెంట్లు నడిపేందుకు అనుమతి ఇస్తున్నట్లు మహరాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆధిత్యా ఠాక్రే తెలిపారు. జనవరి 26నుంచి తొలిసారి ముంబైలోని పోర్ట్ అండ్ కాలా ఘోడా, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే  నగర పోలీస్ కమీషనర్, ముంబై మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకున్నట్లు ఆధిత్యా ఠాక్రే తెలిపారు.

Latest Updates