టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో పరిశ్రమలు నిల్: భట్టి

టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. ఇప్పుడున్న సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ గత ప్రభుత్వంలో తెచ్చినవేనన్నారు. అంతా తామే చేశామన్నట్లుగా టీఆర్ ఎస్ నేతలు స్టేజ్ లపైన ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. రేయన్స్ ఫ్యాక్టరీ, నిజాం సుగర్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైందని ప్రశ్నించారు భట్టి.

Latest Updates