పీసీసీ చీఫ్ కు అతడే కరెక్ట్ : మల్లు రవి సంచలన కామెంట్స్

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌ ను మార్చే అవకాశముందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌ రెడ్డికి ఇవ్వాలన్నారు. పీసీసీ చీఫ్ కు రేవంత్ రెడ్డే కరెక్ట్ అన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన..  కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అయితే మల్లు రవి చేసిన కామెంట్స్ పై ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Latest Updates