IPL మ్యాచ్ రద్దు: గంగూలీపై మమత అసహనం

BCCI అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీ కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మూడో వన్‌డే జరగాల్సి ఉండగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఉందని ఆ మ్యాచ్‌ తో పాటు మొత్తంగా మూడు వన్‌డేల సిరీస్‌నే BCCI రద్దు చేసింది.

అయితే కోల్‌కత్తాలోమ్యాచ్‌ రద్దు చేసేముందు తమకి ఒక మాట చెప్పి ఉంటే గౌరవంగా ఉండేదన్నారు మమతా. గంగూలీతో అంతా బాగానే ఉంది…అయితే మ్యాచ్‌ రద్దుకి ముందు ఒకమాట అయినా ప్రభుత్వంతో చెప్పి ఉండాల్సిందన్నారు. మ్యాచ్‌ రద్దయిన తర్వాత చెబితే ఉపయోగం ఏముందన్నారు.

వారం రోజులుగా తమ రాష్ట్రంలో IPL నిర్వహించవద్దంటూ కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని…తాము మాత్రం మ్యాచ్ నిలిపేయాలని అడగలేదు కదా అన్నారు మమతా బెనర్జీ.

Latest Updates