మమతపై గాంధీ గర్జన

‘‘ఏం చేస్తే బాగుంటుం దో ఆమె ఎవరినీ అడగరు. ఒకవేళ సలహా ఇచ్చినా తీసుకోరు. ఇష్టారీతిగా రాష్ట్రాన్ని పాలిస్తు న్నారు. ఇప్పుడు బెం గాల్ లో నడుస్తున్నది ఏకవ్యక్తి స్వామ్యం . అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామన్నారో ఒక్క పనీ చేయలేదు. నాటి లెఫ్ట్​ ప్రభుత్వం కంటే తృణమూల్ ఒరగబెట్టిందేమీలేదు” అంటూ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పశ్చి మబెంగాల్ లోని మాల్దాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఈ సీజన్ లో తొలిసారిగా దీదీపై నిప్పులు కురిపించారు. ఏదో చేస్తారని ఓటేసిన బెం గాలీలను టీఎంసీ మోసం చేసిందని, రాష్ట్రంలో మమతకు, కేంద్రంలో మోడీకి బెంగాల్ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని రాహుల్ విమర్శించారు. లెఫ్ట్​ హయాంలో జరిగినట్లే ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, అణచివేతలు కొనసాగుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాడుతుండటం అభినందనీయమన్నారు. కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెంగాల్ పరిస్థితుల్ ని చక్కబెడతామని కార్యకర్తలకు మాటిచ్చారు. అన్నివిధాలా సహకరించిన పార్టీని కాదని ఆఖరి నిమిషంలో కొందరు జెండాలు మార్చుతున్నారని, అలాంటి వాళ్లను ఓడించి గుణపాఠం చెప్పాలని రాహుల్ కోరారు. ఇటీవలే కాంగ్రెస్ ను వీడి టీఎంసీలో చేరిన ఎంపీ మౌసుమ్ బెనజీర్ నూర్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ విద్వేషాలు రెచ్చగొడుతూ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Latest Updates