పీఎం ర్యాలీల లెక్కలు చూడాలి: మమత

ఖెజురి/టమ్లుక్‌: ‘ప్రధాని నరేంద్ర మోడీర్యాలీల ఖర్చుల వివరాలు ఎన్నికల కమిషన్‌ అడగాలి. మిగతా వారిని అడుగుతున్నపుడు ఆయన నెందుకు అడగరు’ అని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోందని, ఓట్లను కొంటోందని ఆరోపించారు. అఫిడవిట్‌ లో చాలా చోట్ల ‘తెలియదు’ అని మోడీ రాశారని, కాబట్టి వారణాసిలో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తన భార్య ఆస్తుల గురించి తెలియని అఫిడవిట్‌ లో మోడీ పేర్కొన్నారని, భార్యకు గౌరవమివ్వకుండా దూరం పెట్టిన పీఎం ప్రజలకేం గౌరమిస్తాడని ధ్వజమెత్తారు. నోట్లరద్దుతో మహ్మద్‌‌‌‌ బీన్‌ తుగ్లక్‌‌‌‌ను మోడీ మించి పోయారని ఎద్దేవా చేశారు.

Latest Updates