దారి తప్పిన మమత హెలికాప్టర్

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం ఉత్తర దినాజ్‌ పుర్‌ లోని బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తోన్న సమయంలో మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారి తప్పింది. ఆ విషయం తెలియగానే కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆ వేదిక బంగ్లాదేశ్‌, భారత్‌ కు మధ్య ఉన్న ఇంటర్నేషనల్ బోర్డర్ కు దగ్గరగా ఉంది. దీనిపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సిలిగురిలో నుంచి చోప్రా వద్దకు 20 నిమిషాల్లో రావాల్సిన మమత.. అర్ధగంట ఆలస్యంగా ప్రాంగణానికి చేరుకున్నారు.

తర్వాత ఆ సభలో మాట్లాడుతూ..‘చేరుకోవాల్సిన ప్రాంతాన్ని పైలట్‌ గుర్తించకపోవడం వల్ల నా ఆలస్యానికి కారణం. క్షమించండి. అతడు దారి తప్పాడు. సిలిగురి నుంచి 22 నిమిషాల్లో రావాల్సిన నేను 55నిమిషాల తరవాత చేరుకున్నాను’ అని ఆ సభలో తెలిపారు. సీఎం హెలికాప్టర్ దారి తప్పడంతో వెస్ట్ బెంగాల్ లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

Latest Updates