మోడీ 100 బస్కీలు తీయాలి : మమత బెనర్జీ

వెస్ట్ బెంగాల్ : మే 12న జరగనున్న ఆరో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఇవాళ బంకురా బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ టార్గెట్ గా ఆమె విమర్శలు చేశారు.

“మోడీని ఛాలెజ్ చేస్తున్నా. కోల్ మాఫియా అవినీతిలో మా పాత్ర ఉందని మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలి. మా పార్టీలో కనీసం ఒక్కరు అవినీతిలో భాగం అయ్యారని ఆధారాలతో నిరూపించినా .. నేను 42 మంది తృణమూల్ లోక్ సభ అభ్యర్థులను విత్ డ్రా చేసుకుంటాను” అని మమత బెనర్జీ అన్నారు.

ఒక వేళ మీరు అబద్దాలు చెప్పినట్టయితే… మాపై చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే.. మీ చెవులు మీరే పట్టుకుని… వంద బస్కీలు తీయాలి అని అన్నారు మమత బెనర్జీ.

Latest Updates