మాకు మోడీ బిచ్చం అవసరం లేదు : మమత బెనర్జీ

mamatha-retards-modi-on-vidyasagar-statue-issue-227193-2

డైమండ్ హార్బర్ : బెంగాల్ లో సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహ ధ్వంసం వివాదంలో బీజేపీని తప్పుపట్టారు సీఎం మమతా బెనర్జీ. డైమండ్ హార్బర్ లో ప్రచార సభలో పాల్గొన్న మమత… విద్యాసాగర్ కు టీఎంసీ ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని… బీజేపీ గౌరవిస్తుందని మోడీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఐదేళ్లలో రాముడికి ఒక్క గుడి కూడా కట్టని మోడీ.. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం ఎలా నిర్మిస్తారని నిలదీశారు. బెంగాలీలకుఎవరి సాయం అవసరం లేదన్నారు మమత. బెంగాల్ ప్రజలకు మోడీ ముందు భిక్షమెత్తుకోవాల్సిన అవసరం రాదన్నారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా… కోల్ కతాలో చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యారు మమత. బంగారు బెంగాల్ ను.. బిచ్చగాళ్ల బెంగాల్ గా మార్చారంటూ చేసిన విమర్శను ఆమె తప్పుపట్టారు. బెంగాలీలు బిచ్చగాళ్లా.. బెంగాలీలు బిచ్చగాళ్లలా కనపడుతున్నారా.. అంటూ ఫైరయ్యారు దీదీ.

Latest Updates