ఎలుగుబంటికి ఐ ఫోన్ విసిరిన టూరిస్ట్

బీజింగ్‌: జూలోని ఎలుగుబంటికి ఓ వ్యక్తి క్యారెట్ ముక్కలు, ఫ్రూట్స్ వేస్తూ..పొరపాటున తన చేతిలో ఉన్న ఐఫోన్ ను కూడా విసిరాడు. ఈ సంఘటన చైనాలో జరగగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ లోని యాంచెంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ పార్కులో ఓ వ్యక్తి ఎలుగుబంటికి ఆహారాన్ని వేస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ అదే సమయంలో తన చేతిలో ఉన్న ఐఫోన్‌ ను కూడా విసిరేశాడు. దీంతో అది ఎలుగుబంట్ల ముందు పడింది. వాటిల్లో ఓ ఎలుగుబంటి ఆ ఐఫోన్‌ ను కాసేపు అలాగే చూసి, తర్వాత నోట్లో పెట్టుకుని వెళ్లింది.  ఈ సమయంలో ఒకరు తీసిన వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది.

ఆ ఐఫోన్‌ను జూ సిబ్బంది తిరిగి ఆ ఎలుగుబంటి నుంచి తీసుకురాగలిగారు. అయితే, అది విరిగిపోయి కనపబడింది. ఈ ఘటనతో అక్కడి సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జూకి వచ్చే టూరిస్టులు జంతువులకు ఆహారాన్ని వేయవద్దు. ఓ టూరిస్ట్ యాపిల్, క్యారట్‌ లను ఎలుగుబంట్లకు విసురుతూ ఒక్కసారిగా తన ఐఫోన్‌ను విసిరాడు’ అని తెలిపింది. చాలా ఖరీదైన ఆహారం ఎలుగుబంటికి అందింది’ అంటూ నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.

Latest Updates