పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే వీడియోలు తీసిన అకౌంటెంట్

హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసి కటకటాల పాలయ్యాడో ప్రబుద్ధుడు . టెక్ ప్రపంచంలో ప్రతిదీ డిజిటల్ తో ముడిపడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు అక్రమమార్గంలో డబ్బులు సంపాదించేందుకు, తమకోర్కెలు తీర్చుకునేందుకు పావుగా వాడుకుంటున్నారు. కొత్త కొత్త టెక్నాలజీతో మార్కెట్ లో దొరికే కెమెరాలతో  మహిళల స్నానాల గదుల్లో, షాపింగ్ మాల్స్ లో  ఎక్కడంటే అక్కడ కెమెరాలు పెట్టి నగ్నవీడియోలు తీస్తున్నారు. ఆ నగ్న వీడియోలతో సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా  ఖమ్మం జిల్లాకు చెందిన ఫణీందర్ (30)  హైదరాబాద్ మసీద్ బండలో నివాసం ఉంటున్నాడు. ఎంబీఏ చదివిన ఫణీంద్ర   ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఫణీందర్  నివాసం ఉంటున్న ఇంటికి ఆనుకొని ఉన్న ఇంట్లో ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు . ఓ రోజు భార్య లేని సమయంలో ఫణీందర్ తన ఇంటి బాల్కనీ రెయిలింగ్ ఎక్కీ ఫ్యాన్ రంద్రం ద్వారా పక్కింటి బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళ వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే వీడియోలు తీయడాన్ని బాధితురాలు గమనించి స్థానికుల సాయంతో నిందితుడు దేహశుద్ధి చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates