ఒళ్లు గగుర్పొడిచే దారుణం.. బ్రెయిన్ ను తస్కరించిన దుండగుడు

పిలిప్పిన్స్ లో ఒళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. మహిళను హత్య చేసిన ఓ నిందితుడు బాధితురాలి బ్రెయిన్ ను అన్నంలో నంజుకొని తినడం కలకలం రేపుతుంది.

డిసెంబర్ 5న బాగ్ టాంగ్ అనే యువకుడు రక్తపు మరకలతో రోడ్డుమీద తిరుగున్నాడంటూ స్థానికులు పోలీసులు కు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు..సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ నిందితుడు పారిపోవడంతో స్థానికులు చెప్పిన ఆనవాళ్లతో ఓ ప్రాంతానికి చెందిన అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భీతిగొలిపే చేదు నిజాలు బహిర్ఘతమయ్యాయి.

అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న నిందితుడి ఇంట్లో చేతులు కట్టేసి పూర్తి వివస్త్రగా ఉన్న ఓ మహిళ మొండాన్ని గుర్తించారు. బాధితురాలి తలని కత్తితో నరికి ఆమె బ్రెయిన్ ను తొలగించినట్లు నిర్ధారించారు. తొలగించిన బ్రెయిన్ ను అన్నంలో ఉడికించుకొని తిన్నట్లు గుర్తించిన పోలీసులు..బృందాలుగా విడిపోయి నిందితుడు బాగ్ టాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బాగ్ టాంగ్ ఓ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా ప్లాన్ తో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై నిందితుణ్ని పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చాయి.

నిందితుడు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు..? బాధితురాలు ఎవరు..?బాధితురాలికి నిందితుడికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలి బంధువులెవరైనా ఉంటే తమని ఆశ్రయించాలని పోలీసులు వెల్లడించారు.

Latest Updates