చలాన్లతో చిర్రెత్తి బైక్ నే తగులబెట్టాడు

కొత్త మోటార్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు వాహానదారుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాల మోత మోగిస్తున్నారు. ఢిల్లీలోని షేక్ సరాయి ఏరియాలో టూ వీలర్ నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఓ వ్యక్తికి పోలీసులు ఫైన్ విధించారు.  ఆ చలానా మొత్తాన్ని చూసి షాకైన ఆ వ్యక్తి.. కోపంతో తన బైక్ ను నడిరోడ్డు మీద తగులబెట్టాడు. అక్కడే ఉన్న స్థానికులు ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. తాగిన మత్తులోనే ఆ బైకర్  తన బైక్ ను తగులబెట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

 

Latest Updates