గూగుల్‌‌ స్ట్రీట్‌‌ వ్యూతో అమ్మాయిని ట్రాక్ చేశాడు

జపాన్‌‌లో ఈ మధ్య ఒకడు చేసిన పని సైబర్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ని నివ్వెరపోయేలా చేసింది.  పాతికేళ్ల యువకుడు.. ఒక మోడల్‌‌ను సోషల్ మీడియా అకౌంట్స్‌‌లో ఫాలో అవుతున్నాడు.  ఫొటోలు, పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆమెపై నిఘా వేశాడు. ఏ టైంలో ఎక్కడికి వెళ్తుంది.. ఏం చేస్తుందనే విషయాల్ని ఒక డైరీలో రాసుకున్నాడు. ఆ డిటెయిల్స్‌‌ ఆధారంగా ఆమెని ఫాలో అయ్యాడు.  అంతటితో ఆగకుండా ఆమె ఉంటున్న అడ్రస్‌‌కి వెళ్లి మరీ ఆమెపై దాడికి ప్రయత్నించాడు.

పోలీసులకు ఆ మోడల్‌‌ కంప్లయింట్​ చేయడంతో కటకటాల వెనక్కి వెళ్లాడు. ఎంక్వైరీలో అతను చెప్పిన వివరాలతో పోలీసులు షాక్‌‌ అయ్యారు.  ఆ మోడల్‌‌ సెల్ఫీలలో కళ్లను జూమ్‌‌ చేసి ఆమె ఎక్కడుంటుందో తెలుసుకున్నాడట. ఆ కళ్లలోని అడ్రస్‌‌ను వెతికి మరీ ఆమెను ఫాలో అయ్యాడట. అందుకోసం గూగుల్‌‌ స్ట్రీట్‌‌ వ్యూ సాయం తీసుకున్నాడట.  అంతేకాదు ఆ వివరాలతోనే 12 రోజుల్లో 34 సార్లు ఆమెను ఫాలో అయ్యాడట.  సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏం పోస్ట్‌‌ చేస్తున్నామనే విషయంలో జాగ్రత్తగా ఉండాలనేందుకు ఈ కేసు ఒక ఉదాహరణ.

Latest Updates