హోంమంత్రిపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రతీ చోటా కాపలా ఉండలేమని హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నంకు చెందిన రాం మహారాజ్ అనే వ్యక్తి  సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్ లు చేశాడు. ఈ పోస్ట్ లపై  అశోక్ కుమార్ అనే వైసీపీ కార్యకర్త  ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశాడు.

అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి  పోస్టింగ్ లకు పాల్పడ్డ రాం మహారాజ్ ను అరెస్ట్  చేశారు. ఒక ప్రజాప్రతినిధి అందులోనూ మహిళపై అభ్యంతరకర పోస్టింగ్ లు చేసినందుకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Latest Updates