సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అన్నాడు ప్లేట్ మార్చాడు

man-arrested-for-cheating-sexually-assaulting-woman

హైదరాబాద్ : 10 సంవత్సరాల పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి విషయం మాట్లాడితే.. మంచి జాబ్, లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకుందాం అంటూ టైమ్ పాస్ చేశాడు. యువతి దగ్గర డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రియుడి మాటలు నమ్మిన యువతి.. చివరకు లైంగికంగా, ఆర్థికంగా మోసపోయానని తెలుసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది.

వివరాలు :  నేరేడ్‌ మెట్‌ కు చెందిన యువతి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. పదేళ్ల క్రితం ఆమెకు ఓల్డ్‌ సఫిల్‌ గూడకు చెందిన శ్రీకాంత్‌ తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరుచూ వారిద్దరూ ఫోన్‌ లో మాట్లాడుకునేవారు. 2016లో పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్‌ ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పింది. అప్పటి నుంచి ఆమె జీతం డబ్బులను శ్రీకాంత్‌ తీసుకునే వాడు. మూడేళ్లుగా కలిసి తిరుగుతున్నారు.

ఇప్పుడు అతను ప్లేట్ మార్చాడు. రెండు నెలలుగా యువతి ఫోన్‌ చేసినా రెస్పాన్స్ ఇవ్వకపోగా.. తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితుడిపై IPC 376 (2), 420, 417, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.

Latest Updates