పక్కింటి పెంపుడు కుక్కని కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్

పదేపదే ఇంట్లోకి వస్తుందన్న కోపంతో కుక్కను గన్ తో కాల్చి చంపిన ఘటన సరూర్ నగర్ లో జరిగింది. బాపు నగర్ కు చెందిన అవినాష్…అదే కాలనీకి చెందిన సుదర్శన్ యాదవ్ పెంపుడు కుక్కను  గన్ తో కాల్చి చంపాడని తెలిపారు పోలీసులు. అవినాష్ బేగంపేట్ HDFC లో మేనేజర్ గా పని చేస్తున్నాడని చెప్పారు.అవినాష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూగజీవాన్ని చంపినందుకు ఎనిమల్ యాక్ట్ క్రింద చర్య తీసుకోబోతున్నామని పోలీసులు చెప్పారు.

 

Latest Updates