బాలాపూర్‌లో దారుణం.. తోటి వర్కర్ ని చంపిన ప్లంబర్

హైదరాబాద్: నగరంలోని బాలాపూర్ లో దారుణం జరిగింది. ఈ నెల 9వ తేదీన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన సత్యనారాయణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కర్మాన్ ఘాట్ లో నివాసం ఉంటున్న సత్యనారాయణ.. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో నుండి అదృశ్యం కావడంతో ఈ నెల 9వ తేదీన  అతని భార్య లక్ష్మీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టగా.. గురువారం సాయంత్రం బాలాపూర్ లోని దేవతల గుట్టపై సత్యనారాయణ మృతదేహాన్ని కనుగొన్నారు. సత్యనారాయణ ను హత్య చేసింది నర్సింగ్ రావు అని, వారిద్దరు కూడా ప్లంబర్ వర్క్ చేసే వారని , సత్యనారాయణ ను హత్య చేసి నర్సింగ్ రావు పోలీసులకు లోగిపోయినట్లు సమాచారం.

క్షుద్రపూజలే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు , స్థానికులు తెలుపడం జరిగింది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

man arrested for killing co worker in balapur hyderabad

Latest Updates