నకిలీ సొసైటీ పేరుతో కోట్ల దోపిడి.. వ్యక్తి అరెస్ట్

man-arrested-for-to-take-money-from-businessmen-on-the-name-of-tax

నకిలీ సొసైటీ పేరుతో టాక్స్ కట్టకుండా  22 కోట్ల రూపాయలను దోచుకున్న వ్యక్తిని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ DCP జోగయ్య తెలిపిన సమాచారం మేరకు… ఎల్బీ నగర్ హస్తినా పురానికి చెందిన సాన రవి అనే వ్యక్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో ఐటి యాక్ట్ 35. పర్మిషన్ ఉన్నదని  పలువురు వ్యాపారవేత్తలు నుండి  అతని సొసైటీ పేరుపై లావాదేవీలు చేశాడు. ఈ విధంగా చెయ్యడం వల్ల  టాక్స్ పడకపోవడంతో సగటు వ్యాపారవేత్తలు పెద్ద మొత్తం లోనే లావాదేవీలు జరిపారు. అందుకోసం నిందితుడు  వారి నుండి 5 శాతం కమిషన్ ను తీసుకున్నాడు.

సొసైటీ లావాదేవీలపై అనుమానం వచ్చి ఇన్ కమ్ టాక్స్ అధికారులు CCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న CCS పోలీసులు నిందితుడు రవి ను అదుపులోకి తీసుకొని విచారించగా… దాదాపు 200 మంది వ్యాపారవేత్తలు నుండి  22 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో నిందితుడు సాన రవి ను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ జోగయ్య తెలిపారు.

 

Latest Updates