స్నేహంగా ఉంటూ బంగారం తాకట్టు

నార్సింగి : రా ఏజెంటునంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్ వర్ధన్ అనే వ్యక్తి గతంలో రాలో పని చేశానంటూ మహిళలను ట్రాప్ చేస్తున్నాడు. ఇటీవల ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆనంద్ వర్ధన్…. ఓ మహిళను ట్రాప్ చేశాడు. ఆమెతో స్నేహంగా ఉండి బంగారాన్ని తాకట్టు పెట్టాడు. ఐతే బంగారం తీసుకురావాలంటూ మహిళ ఒత్తిడి తీసుకురావడంతో కొత్త నాటకం మొదలు పెట్టాడు. రా ఏజెంట్ కావడంతో తనను కొందరు బెదిరిస్తున్నారని, హత్య చేసేందుకు ప్లాన్ చేశారని కొత్త కథ అల్లాడు. అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ వర్ధన్ ను అరెస్టు చేశారు.

Latest Updates