లక్షల్లో వసూలు.. డూప్లికేట్ పట్టాలు..డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని చీటింగ్

లక్షల్లో వసూలు.. డూప్లికేట్ పట్టాలు..డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని చీటింగ్
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

జూబ్లీహిల్స్, వెలుగు: ‘నాకు రెవెన్యూ అధికారులు చాలా దగ్గర.. డబుల్​ బెడ్రూం ఇండ్లు కావాలంటే ఇప్పిస్తా’ అంటూ ఓ వ్యక్తి కొందరిని నమ్మించాడు. లక్షల్లో వసూలు చేసి మోసగించాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ సైట్–3 ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు తనకు రెవెన్యూ అధికారులంతా తెలుసని, ఏ పనైనా అవుతుందని ప్రచారం చేసుకున్నాడు. డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇప్పిస్తానని పలువురికి చెప్పాడు. 

అదే ప్రాంతానికి చెందిన దుర్గా నాగలక్ష్మి అతడిని నమ్మి రూ.3 లక్షల 50 వేలు ఇచ్చింది. వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారుల పేరుతో నకిలీ పట్టాలను సృష్టించి ఆమెకు ఇచ్చాడు. ఇదే తరహాలో మరో ఇద్దరి దగ్గర లక్షల్లో దండుకుని నకిలీ డాక్యుమెంట్స్​తో చీట్​ చేశాడు. రోజులు గడుస్తున్నా ఇండ్లు చూపించకపోవడంతో మోసం చేశాడని గ్రహించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.