మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కావాలంటే మళ్లీ పెళ్లి చేసుకో

man-asks-for-marriage-certificate-after-16-yrs-officials-say-remarry

మ్యారేజ్ సర్టిఫికెట్ కోసమని రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళితే మళ్ళీ పెళ్లి చేసుకోమని అమర్యాదగా మాట్లాడారు అక్కడి అధికారులు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కోమ్ మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది.

కేరళకు చెందిన మధుసూదన్‌ అనే వ్యక్తికి 2003 ఫిబ్రవరి 27న వివాహమైంది. ఆ సమయంలో అతను మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదు. ఇటీవల ఆయనకు సర్టిఫికెట్‌తో అవసరం పడటంతో.. పదహారేళ్ల క్రితం తన పెళ్లైందని, ఆ వివరాలు తెలిపి తనకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిందిగా రిజిస్ట్రార్ ఆఫీస్ అధికారులను కోరాడు.

కాని అక్కడి అధికారులు 16 ఏళ్ల క్రితం నాటి రికార్డులు చూడలేక.. మళ్లీ పెళ్లి చేసుకుంటే మూడు రోజుల్లో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తామని మధుసూదన్‌కు చెప్పారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని మధుసూదన్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ విషయం కాస్త ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ మంత్రి సుధాకరన్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారుల చేత సస్పెండ్ చేయించారు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

Latest Updates