సొంత అన్నను కాళ్లూ, చేతులు కట్టేసి..

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడికుర్తి గ్రామంలో జరిగిన ఓ భూ వివాదంలో సొంత అన్నను ఓ వ్య‌క్తి కాళ్లూచేతులు కట్టేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసుల కథనం ప్రకారం.. అన్న తిరుపతయ్య, తమ్ముడు కురుమయ్య మధ్య భూ వివాదం కొనసాగుతోంది. రెండురోజుల క్రితం తన పొలంలో దిగబడిన ట్రాక్టర్ ని తీసేందుకు… ‌తిరుపతయ్య శుక్ర‌వారం అక్కడికి వెళ్లాడు. అప్పటికే తన కుటుంబసభ్యులతో అక్కడ ఉన్న కురుమయ్య .. పథకం ప్రకారం అన్నపై దాడి చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి పొలంలో ఈడ్చుకెళ్లారు. అనంతరం చెట్టుకు కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను చుట్టుపక్కల వాళ్లు మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు నాగర్‌కర్నూలు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు

Latest Updates