పెండ్లి చేసుకోబోయే మైనర్ బాలికపై నిఘా.. ఆపై అరెస్ట్

పెళ్లి చేసుకోబోయే అమ్మాయిపై నిఘా పెట్టి జైలు పాలయ్యాడు ఓ వ్యక్తి. రాచకొండ కమిషనేరేట్ పరిధి చైతన్యపురి కి చెందిన ఓ మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన మహేష్ అనే వ్యక్తికి పెండ్లి కుదిరింది. అయితే ఆ అమ్మాయి మైనర్ కావడంతో కొంతకాలం ఆగేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. మహేష్ మాత్రం ఆ అమ్మాయి క్యారక్టర్ ఎలాంటిదో తెలుసుకునేందుకు ప్రైవేట్ గూడాచారి సంస్థతో 17వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లినా వాళ్లు ఫాలో అయ్యేవారు. అనుమానం వచ్చిన అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో మహేష్ తోపాటు.. ఫ్రైవేట్ డిటెక్టివ్ సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటువంటి నకిలీ డిటెక్టివ్ సంస్థ లను నమ్మవద్దని.. మహిళలు, బాలికల పై ఇటువంటి చర్యలకు పాలుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రాచకొండ కమిషనర్.

Latest Updates