ఏపీలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

విశాఖపట్నంలోని గాజువాకలో దారుణం జ‌రిగింది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు.ఈ సంఘటన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ ఫెర్రీ వీధికి చెందిన వాలంటీర్‌ ప్రియాంకపై శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలపాలైన యువతిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. వారితో మాట్లాడుతూనే అదే కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే తేరుకున్నస్థానికులు.. వారిద్దరిని కేజీహెచ్‌కు తరలించారు. ప్రియాంక ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమెను శ్రీకాంత్ ప్రేమిస్తున్నట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates