భయంకరమైన ర్యాష్ డ్రైవింగ్ .. అయ్యే పాపమన్న పోలీసులు

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పామును చూస్తే ఏం చేస్తారు..? ప్రాణ భయంతో పరుగులు తీస్తారు. కానీ అదే పాము కాటు వేస్తే. ఇంకేమన్నా ఉందా అంటారా…?

ఆస్ట్రేలియా క్విన్స్ లాండ్ కు చెందిన ఓ హెవే పై వాహనాల రద్దీ ఎక్కువగా  ఆ వాహనాల్లో జిమ్మీ అనే యువకుడు భయంకరమైన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో  ఎవరైనా అడ్డం వస్తే అంతే సంగతులు. ఆస్పత్రి పాలవ్వాల్సిందే. లేదంటే పై ప్రాణాలు పైకి పోతాయి.

జిమ్మీ డ్రైవింగ్ పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుకొని జైల్లో వేయాలన్నంత కోపంగా యువకుడి వాహనాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినా సరే జిమ్మీ తన కారు స్పీడు ఆపలేదు సరి కాదా ఇంకా వేగం పెంచాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీసులు అంతకంత స్పీడ్ పెంచి జిమ్మీ కారును చేజ్ చేసి పట్టుకున్నారు.

ఇంత స్పీడ్ గా వెళితే ప్రాణాలు పోతాయి. చిన్నగా వెళొచ్చుగా అంటూ పోలీసులు యువకుడిపై మండిపడ్డారు. దీంతో జిమ్మీ మీరు కారు ఆపారు. నా ప్రాణాలు పోతాయ్. నన్ను ప్రపంచంలోనే అంత్యత విషపూరితమైన పాము కాటేసింది. దాన్ని చంపి ప్రాణాల్ని కాపాడుకునేందుకు అంత స్పీడ్ వెళుతున్నానంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో అయ్యే పాపం అంటూ పోలీసులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

Latest Updates