వీడియో: ఆవు మాంసం తరలిస్తున్నాడని.. తల మీద సుత్తితో కొట్టి..

ఆవు అక్రమంగా రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో ట్రక్కు డ్రైవరును కొంతమంది మూకుమ్మడిగా చితకబాదిన ఘటన హర్యానాలోని గుర్గావ్ లో జరిగింది. గుర్గావ్ లోని సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఒక ట్రక్కు వెళ్తుంది. అయితే ఆ ట్రక్కు డ్రైవర్ లుక్మాన్ అక్రమంగా ఆవు మాంసాన్ని రవాణా చేస్తున్నాడని కొంతమంది అనుమానపడ్డారు. దాంతో ట్రక్కును 8 కిలోమీటర్లు వెంబడించి.. లుక్మాన్ ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత లుక్మాన్ ను అదే ట్రక్కులో కట్టేసి.. బాద్షాపూర్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత మరికొంత మంది లుక్మాన్ మీద విరుచుకుపడ్డారు. కొంతమంది కాళ్లతో తన్నగా, మరి కొంతమంది పిడిగుద్దులు గుద్దారు. ఒక యువకుడైతే సుత్తితో లుక్మాన్ తలమీద, కాళ్లమీద తీవ్రంగా కొట్టాడు. దాంతో లుక్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా ట్రక్కు మీద బండ రాళ్లు విసిరి ద్వంసం చేశారు. విషయం తెలిసి అక్కడికొచ్చిన పోలీసులు.. లుక్మాన్ ను ఆస్పత్రికి తరలించారు. వాహనంలోని మాంసాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబుకు పంపించారు. ఈ ఘటనను అక్కడున్న చుట్టుపక్కల వాళ్లు వీడియో తీశారు. ఆ వీడియో ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేయోచ్చు. కానీ, పోలీసులు ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. పైగా.. గుర్తు తెలియని వ్యక్తుల దాడి అని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లుక్మాన్ యజమాని గత 50 సంవత్సరాలుగా మాంసం వ్యాపారం చేస్తున్నాడు. హిందూ మత ఆచారం ప్రకారం.. ఆవులను వధించడం చట్టవిరుద్ధం. ఆవుల పట్ల భక్తితో ప్రజలను చంపడం ఆమోదయోగ్యం కాదని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

For More News..

రెండు మిని ఫ్లైట్స్ ఢీ.. స్పాట్లోనే అందరూ మృతి

‘సింగరేణి’లో కరోనాతో చనిపోతే రూ.15లక్షల పరిహారం

అయోధ్య భూమి పూజకు 1,11,000 లడ్డూలు

Latest Updates