రూ.20 కోసం కొట్లాట.. ఒకరి మృతి

న్యూఢిల్లీ:  రూ.20 కోసం జరిగిన కొట్లాట.. ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటన ఇటీవల ఢిల్లీలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నివాసం ఉండే రూపేశ్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న సెలూన్ కు హేయిర్ కట్టింగ్ చేయించుకోవడానికి వెళ్లాడు. కటింగ్ చేసిన వ్యక్తి రూపేశ్ ను రూ.50 ఇవ్వమని అడిగాడు. అయితే.. రేపేశ్ రూ.30 ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తానని అన్నాడు. మిగతా రూ.20 కూడా వెంటనే ఇవ్వాలని కటింగ్ చేసిన సంతోష్ అతని సోదరుడు సరోజ్ రూపేశ్ తో వాగ్వాదానికి దిగారు.

అది పెద్ద ఘర్షణకు దారి తీసి ఇద్దరు సోదరులు రూపేశ్ ను కర్రలతో కొట్టారు. తీవ్రగాయాలతో హాస్పిటల్ కు వెళ్లిన బాధితుడు ట్రీట్ మెంట్ తీసుకుంటూ సోమవారం చనిపోయాడని తెలిపారు స్థానిక పోలీసులు. ఈ సంఘటన సెప్టెంబర్ 24న జరుగగా ఆలస్యంగా తెలిసిందన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు నిందుతులను అరెస్ట్ చేశామని తెలిపారు ఢిల్లీ పోలీసులు.

Latest Updates