దొంగతనం చేసిండని కట్టేసి తమ సరదా తీర్చుకున్రు

దొంగతనం చేసిండని కొట్టి చంపిన్రు

యూపీలో తాగుబోతుపై మూక దాడి

చితకబాది సరదా తీర్చుకున్నరు.. బాధితుడి తల్లి ఆవేదన

బరేలీ (యూపీ): దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ తాగుబోతును చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో చోటు చేసుకుంది. 32 ఏళ్ల యువకుడిని చోరీ అనుమానితుడిగా సెక్యూరిటీ గార్డు పట్టుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు చెట్టుకు కట్టేసి గంటలపాటు చితకబాదారు. మొబైల్ లో వీడియోలు, ఫొటోలు తీశారు. దెబ్బల ధాటికి యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. తర్వాత స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే, ఎవరూ కంప్లైంట్​ చేయకపోవడంతో ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పోలీసులు వదిలేశారు. అక్కడి నుంచి నెమ్మదిగా ఇంటికి చేరుకున్న యువకుడిని కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ యువకుడు చనిపోయాడు. మృతుడు బసీద్ ఖాన్ దొంగ కాదని, తాగుబోతని పోలీసులు గుర్తించారు. తన కొడుకును చితకబాది స్థానికులు తమ సరదా తీర్చుకున్నారని మృతుడి తల్లి ఆరోపించింది. తన కొడుకును చెట్టుకు కట్టేసి కొడుతున్న విషయం తెలియగానే..రెండో కొడుకు భయంతో ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడని చెప్పింది. తర్వాత కొందరు పోలీసులు తన కొడుకును ఇంటి దగ్గర వదిలేసి వెళ్లినట్లు తెలిపింది.

నిందితులను గుర్తిస్తున్నాం: ఎస్పీ శైలేష్ పాండే

బసీద్​ను చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో మాకు అందింది. దాని ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్ పీ) శైలేష్ పాండే చెప్పారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు. చావుకు కారణం ఏమిటన్నది పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుందని చెప్పారు.

For More News..

బార్డర్లో ముగ్గురు చైనా వాళ్లను కాపాడిన ఇండియన్ ఆర్మీ

కరోనాపై టెన్షన్ వద్దు.. కంట్రోల్​లోనే ఉంది

త్వరలో ‘వన్ ప్రొడక్ట్ వన్ డిస్ట్రిక్ట్​ట్​’

Latest Updates