ఒక్క కాలుకే 9 వేళ్లు

మామూలుగా అయితే మనుషులకు ఒక్క కాలికి ఐదు వేళ్లుంటాయి. కానీ చైనాకు చెందిన అజున్​ అనే వ్యక్తి ఎడమ కాలికి 9 వేళ్లున్నాయి. వేళ్లు ఎక్కువుండటంతో  కొనుక్కున్న చెప్పులూ పట్టేవి కాదట. అందుకే చెప్పులను పక్కకు విసిరిపడేసి ఉత్త కాళ్లతోనే వెళ్లిపోయేవాడట. కాలి వేళ్లను తీయించాలని తన అమ్మానాన్నలకు చెప్పినా వాళ్లకున్న మూఢనమ్మకాలతో అతడు పెద్దయ్యేదాకా అలాగే ఉండనిచ్చారట. స్వర్గం ఇచ్చిన కానుక అని చెప్పేవారట. ఆ వేళ్లు శుభశకునం అని ఎవరో మంత్రగాడు చెప్పడం వల్ల తన మాటను తల్లిదండ్రులు వినలేదని అజున్​ చెబుతున్నాడు. ప్రస్తుతం 21 ఏళ్లున్న అతడు, చైనాలోని లుఫెంగ్​ సిటీలోని షుండే హెపింగ్ సర్జికల్ ఆస్పత్రిలో ఆపరేషన్​ చేయించుకుని ఆ వేళ్లను తొలగించేసుకున్నాడు. డాక్టర్లు దాదాపు 9 గంటలు కష్టపడి ఆపరేషన్ చేసి వేళ్లను తొలగించారు. ఈ సమస్యను పాలిడాక్టిలీ అని పిలుస్తారని చెప్పారు.

 

Latest Updates