ఆక్సిజన్​ లేకుండా సముద్రంలో 38 నిమిషాలు

ఒక్క రెండు నిమిషాలు ఆక్సిజన్​ లేకుండా బతకగలరా? చాలా కష్టం అంటారా! మామూలు మనిషి రెండు మూడు నిమిషాలు ఆక్సిజన్​ లేకుండా ఉండడమంటే ఊపిరాగిపోవడమే. కానీ, బ్రిటన్​కు చెందిన క్రిస్​ లెమన్స్​​ అనే డైవర్​ 38 నిమిషాల పాటు సముద్రంలో 300 అడుగుల లోతులో ఆక్సిజన్​ లేకుండా బతికి బట్టగట్టాడు. 2012 సెప్టెంబర్​లో నార్త్​ సీలో జరిగిన ఆ ఘటనపైనే ఇప్పుడు బీబీసీ ‘లాస్ట్​ బ్రెత్​’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. 2012 సెప్టెంబర్​ 18న క్రిస్​ లెమన్స్​, డేవ్​ యువాసా, డంకన్​ అల్​కాక్​ మరో ఇద్దరు డైవర్లు అబర్దీన్​కు 204 కిలోమీటర్ల దూరంలో నార్త్​ సీలోపలకి డైవ్​ చేయాల్సి ఉంది. వాళ్లకు సపోర్ట్​గా బిబ్బీ టోపజ్​ అనే నావ ఒడ్డున ఉంది. కానీ, లెమన్స్, యువాసా మాత్రమే డైవ్​ చేశారు. అంతలోనే వాళ్లకు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఆ నావ కంప్యూటర్​ ఫెయిలవడం వల్ల బిబ్బీ టోపాజ్​ డ్రిఫ్ట్​ అవడం మొదలుపెట్టింది. యువాసా, లెమన్స్​ ఒకేసారి డెక్​పైకి రావాల్సిందిగా అలారం మోగింది.

చిన్నచిన్నగా టోపాజ్​ అక్కడి నుంచి దూరంగా వెళ్లడం మొదలెట్టింది. ఇటు యువాసా, లెమన్స్​లు పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లెమన్స్​ డైవింగ్​ సూట్​లోని అన్నీ ఫెయిలయ్యాయి. అందరితోనూ కనెక్షన్​ కట్​ అయిపోయింది. సముద్రం అడుగుకు వెళ్లిపోయాడు. లెమన్స్​ కోసం వెంటనే సెర్చ్​ చేయడం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ ట్యాంకుల్లోని ఆక్సిజన్​తో మహా అయితే 8 నిమిషాలు అతడు బతకగలడని అంచనా వేశారు. ఇక, ఆ నీటి చీకట్లలో ఆయిల్​ బావి వద్ద ఉండే ఓ చిన్న షెల్ఫు అతడి బతుకుపై ఆశ రేపింది. కానీ, ఆ చీకట్లో దారి తప్పితే మరిన్ని కష్టాలు ఎదురు కావొచ్చన్న ఆందోళనా మొదలైంది. ఎలాగో అలా ఆ షెల్ఫ్​ దగ్గరకి వెళ్లాడు లెమన్స్​. అప్పటికే ఆక్సిజన్​ అంతా అయిపోయింది. శ్వాస అందట్లేదు. అచేతనంగా అతడు పడిపోయాడు. సెర్చ్​ ఆపరేషన్​ చేస్తున్న తోటి డైవర్లకు సెన్సర్ల ద్వారా షెల్ఫ్​ మీద పడి ఉన్న లెమన్స్​ కనిపించాడు. అంతా చనిపోయాడనే అనుకున్నారు. పైకి తీసుకొచ్చారు. రెండు మూడు సార్లు అతడికి నోటి ద్వారా ఊపిరందించే ప్రయత్నం చేశారు. అతడి లేచి కూర్చున్నాడు. అయితే, ఆక్సిజన్​ అనేదే లేకుండా 38 నిమిషాల పాటు అతడెలా బతకగలిగాడన్నదే వాళ్లను తొలిచేసిన ప్రశ్న.

Latest Updates