కారులో పడుకుంటే కాలిపోయాడు

తాండూరు, వెలుగు: పాత కారులో మంటల చెలరేగి అందులో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. తాండూరు పీఎస్ పరిధిలోఈ ఘటన జరిగింది. తాండూరులోని వాల్మీకినగర్ కి చెందిన బోయ ఈరన్న(68) 15 ఏండ్ల క్రితం ఇంట్లో గొడవపడి బయటి కొచ్చాడు. ఈరన్న భిక్షాటన చేసుకుంటూ ఫుట్ పాత్ లపై పడుకునేవాడు.గంజ్ మార్గంలోని మర్రిచెట్టు కూడలి వద్ద మూడేళ్లుగా ఓ పాత కారు నిలిపి ఉంది. ఈరన్న కొంత కాలంగా రాత్రివేళల్లో ఆ పాత కారులోనిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ఎప్పటి లాగే ఈరన్న కారులో నిద్రపోయాడు. ఉదయం కాలనీవాసులు చూసే సరికి మంటల్లో దగ్ధమైన కారు కనిపించింది. ఈరన్న కూడా అందులో సజీవ దహనమై ఉంటాడని భావించిన కాలనీ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మర్రిచెట్టు కూడలి పరిసరాల్లో ఆదివారం మైసమ్మ ఆలయ ఉత్సవాలు జరిగాయి. కారు పక్కనే స్థానికులు టెంట్ వేసి వంటలు చేశారు. ఎవరైనా రాత్రి అక్కడ చలిమంట కాచుకున్నారా లేదా వంటలు చేసిన తర్వాత కట్టెలకు ఉన్ననిప్పు ప్రమాదవశాత్తు కారుకు అంటుకుందా లేక ఈరన్న బీడీ తాగికారులో పడేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికు మార్తెలిపారు. ఈ సంఘటన వెనుక ఎలాంటి అనుమానాలు లేవన్నారు.పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.

Latest Updates