చెట్లు నరికిన వ్యక్తికి రూ.30వేల జరిమానా

సిద్దిపేట జిల్లాలో చెట్లను నరికేసిన వ్యక్తికి జరిమానా విధించారు అధికారులు. మిలన్ గార్డెన్ రోడ్డులో బృందావన కాలనీ ఎదురుగా ఉన్న 30 హరితహారం చెట్లను తెలుజూరు బాలయ్య అనే వ్యక్తి నరికివేశాడు. విషయం తెలుసుకున్నమున్సిపల్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలయ్యకు రూ.30 వేల జరిమానా విధించారు. అంతేకాదు అతనితో 30 చెట్లు నాటించి…ఏడాది కాలం పాటు ఆ మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా అతనికే  అప్పగించారు.

 

Latest Updates