ఢిల్లీ ఎయిమ్స్ లో బీహార్ వాసి సూసైడ్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఎమర్జెన్సీ వార్డులో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎయిమ్స్ రెండో ఫ్లోర్ లోని మెట్ల వద్ద ఉన్న గ్రిల్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు శుక్రవారం మీడియాకు తెలిపారు. మృతుడిని బీహార్‌లోని గోపాల్‌గంజ్ నివాసి బిట్టు కుమార్ తివారీ(22)గా గుర్తించారు.రెండవ అంతస్తులోని మెట్ల గ్రిల్ నుండి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.సూసైడ్ కి కారణాలు తెలియరాలేదని, పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగిస్తామని తెలిపారు.

Latest Updates