సిలిండర్ పైప్ తో గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్, వెలుగు: సిలిండర్ పైప్ తో గ్యాస్ పీల్చి బ్యాంక్ ఎంప్లాయ్ చనిపోయిన ఘటన చైతన్యపురి పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..కొత్తపేటలోని యాదవ్ నగర్ కాలనీలో ఉన్న వైష్ణవి శోభా అపార్ట్ మెంట్ లో ఉంటున్న అనురాగ్(30) బ్యాంక్ ఎంప్లాయ్. గత శుక్రవారం పేరెంట్స్ ను తిరుపతి పంపించిన అనురాగ్.. ఆదివారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ ను బెడ్ రూంలోకి తెచ్చి తలకు ప్లాస్టిక్ కవరు చుట్టుకుని దానికి రంధ్రం చేసి పైపు నోట్లో పెట్టు కుని గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ కి గల కారణాలు తెలియరాలేదన్నారు.

Latest Updates